వీడీతో సమంత ఖుషి ఖుషీగా!
on Jun 13, 2023

వీడీతో సమంత ఖుషీ ఖుషీగా ఉన్నారు. సెర్బియాను సరదాగా చుట్టేస్తున్నారు. వచ్చే ఏడాది చూడండి మా తడాఖా అంటూ హింట్ ఇస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా, సమంత రూత్ ప్రభు హీరోయిన్‌గా నటిస్తున్న సిటాడెల్ సీరీస్ షూటింగ్ ప్రస్తుతం సెర్బియాలో జరుగుతోంది. షూటింగ్ పూర్తయిన తర్వాత యూనిట్ అక్కడి లొకేషన్లలో హల్‌చల్ చేస్తోంది. రీసెంట్‌గా వరుణ్ ధావన్ షేర్ చేసిన కొన్ని పిక్స్ వైరల్ అవుతున్నాయి. సమంతతో ఫ్యామిలీమేన్2 చేసిన రాజ్ అండ్ డీకే చేస్తున్న సీరీస్ సిటాడెల్. స్కై హై ఎగ్జయిట్‌మెంట్‌తో పనిచేస్తోంది టీమ్. ప్రస్తుతం సెర్బియాలో యాక్షన్ ఎపిసోడ్స్ ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ గ్యాప్‌లో సరదాగా ఉన్న ఫొటోలు అభిమానులను అలరిస్తున్నాయి. బ్లూ బెర్రీ డెసర్ట్ తింటున్న వరుణ్, సామ్ ఫొటో బాగా వైరల్ అవుతోంది.
ఆర్చరీ నేర్చుకుంటున్నారు వరుణ్ ధావన్. ఆ ఫొటో కూడా వైరల్ అవుతోంది. కేకే మీనన్ కూడా సిటాడెల్‌లో ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. సిటాడెల్ ఇండియా వెర్షన్ చూడటానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నామని అన్నారు ఫ్యాన్స్. ఇటీవల వరుణ్, సమంత, రాజ్ డీకేతో పాటు టీమ్ అంతా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఆమెను కలవడం గౌరవంగా, ఆనందంగా ఉందని పేర్కొంది టీమ్. ఇటీవల విడుదలైన ఒరిజినల్ సిటాడెల్ వెర్షన్‌లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు వరుణ్ ధావన్. ఆయన పాత్రకు ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నందుకు స్పెషల్‌గా థాంక్స్ చెప్పింది టీమ్. ప్రియాంక చోప్రా, రిచర్డ్ నటించిన హాలీవుడ్ సీరీస్ సిటాడెల్. ఈ సీరీస్ ఇండియన్ వెర్షన్ చూడటానికి ఆనందంగా ఉందని అన్నారు సమంత.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



